July 20, 2018

జిస్ దేశ్ మే గంగా బెహతీ హై ....


పాకిస్తాన్ రేడియోలో భారత దేశభక్తి గీతం

నేను చూసిన మొట్టమొదటి రాజ్ కపూర్ సినిమాలో పాట. ఏ దేశంలో అయితే నాలుకలపై నిజంమాత్రమే వున్నదో, ఏ దేశంలో ప్రజల హృదయాల్లో స్వచ్ఛత వున్నదో, ఎక్కడైతే గంగా నది ప్రవహిస్తూ వున్నదో -- మాది ఆ దేశం.
ముఖేష్ గొంతులోంచి అద్భుతంగా ప్రవహించిన ఈ పాట కోట్లమందికి ఇష్టం. దేశభక్తులకి కూడా.
ఆగస్టు 15, జనవరి 26 -- ఇంకా అనేకానేక దేశభక్తి దినాలలో దేశవ్యాప్తంగా రోడ్లమీద, సమావేశాల్లో వినిపించే పాట.
ఈ రోజు పొద్దున్నే ఒక ఎఫ్ ఎమ్ రేడియో స్టేషన్లో విన్నా వాకింగ్ చేస్తూ.
కానీ, భక్తులారా వినండి. (షాక్ గురవుతారు జాగ్రత్త.) నేను విన్నది మనదేశంలో స్టేషన్లో కాదు.
పాకిస్తాన్ రేడియో స్టేషన్లో. రేడియో గార్డెన్ లో మ్యాప్ తిప్పుతుంటే ఒక నగరంలో ఆగింది. కరాచీ లోని 'బక్వాస్' అన్న రేడియో స్టేషన్ లో ఆ పాట వచ్చింది.
పాకిస్తాన్ లోని ఏ ఎఫ్ ఎమ్ స్టేషన్లో అయినా ముఖేష్, రఫీ, కిషోర్, లత,ఆశా పాటలు అనునిత్యం వస్తుంటాయి. బహుశా వాళ్లకి మనకి ఉన్నట్టు దేశభక్తి ఉన్నట్టు లేదు. బద్ధ శత్రువైన ఇండియా సింగర్ల పాటలు ఎలా వింటారు?
మనకి ఎంత దేశభక్తో! పాకిస్తాన్ నటులు మన సినిమాల్లో నటించనీయం.. అక్కడి పాటగాళ్లు ఇక్కడ కచేరీ ఇవ్వనీయం.
పైగా, వీటిని అతిక్రమించిన వాళ్ళని పాకిస్తాన్ వెళ్లిపొమ్మంటాం.
"జిస్ దేశ్ మే గంగా బెహతీ హై ..." పాటను పాకిస్తాన్ స్టేషన్ వినిపించినట్టు, ఏదైనా పాకిస్థాన్లోని నదినో, నాయకుడినో పొగిడే పాటను మనదేశంలో ఎక్కడైనా వినిపిస్తే ఏమవుతుంది? తలుచుకుంటేనే భయం వేస్తుంది.
అందుకే హాయిగా, 'జిస్ దేశ్ మే గంగా బెహతీ హై ... ' పాటను ఎంజాయ్ చేస్తే సరి.
https://www.youtube.com/watch?v=NEO6mdojRfY

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...