సాహిత్యం, జర్నలిజం, రాజకీయాలు, టెక్నాలజీ, సినిమాలు Literature, Journalism, Politics, Technology, films.
March 29, 2016
March 11, 2016
కాళ్ళూ చేతులూ లేని కవిత్వం....

గురూగారు పతంజలి చనిపోయి మరో సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు ఆయన మన సామూహిక జ్ఞాపకంలో అపురూపమైన భాగమైపోయారు. ‘నలుగురు కూచుని నవ్వే వేళల’ మాత్రమే కాదు, నలుగురు కూచుని రోధించే వేళ, కుట్రదారులైన పాలకులపై కుపితులైన వేళ పతంజలి గారు గుర్తుకువస్తారు.
ప్రజాస్వామ్యం నగుబాటైన, అవుతున్న సందర్భాల్లో, మెజారిటీ మత దాష్టీకాలు పెచ్చరిల్లుతున్న సందర్భాల్లో పతంజలి గారు గుర్తుకు వస్తారు.
పతంజలి గారు ఏ పదమూ, ఏ వాక్యమూ నిద్రపోయినట్టు వుండదు. నీరసంతో, ఉదాసీనతతో జీవచ్ఛవం లా వుండదు. పతంజలి గారి పదాలు, వాక్యాలు కరెంటు తీగల్లాగా వుంటాయి. అవి కల్లోలాలని చిత్రించే గొప్ప చిత్రకారుడి చేతులు. అవి ముడి జీవితాన్ని ప్రేమించిన అక్షరాలు.
జీవితమే కాదు దాన్ని చిత్రించే సాహిత్యం కూడా స్తబ్దుగా వుంటే పతంజలి గారికి ఇష్టం వుండదు. 1996-97 మధ్య రాసిన ఈ కవిత చదివితే మీకు అర్ధం అవుతుంది పతంజలి గారికి నంగిరి మనుషులంటేనే కాదు, నంగిరి కవిత్వమన్నా చాలా అసహ్యమని. జవాసత్వాలు లేని సాహిత్యాన్ని ఆయన కాళ్ళూ చేతులూ లేని కవిత్వమని, అది దుర్వాసన వేస్తోందని అంటారు. నేలలోకి వేళ్ళు దిగని, కలల్ని కనని, భూమితో మాట్లాడని కవిత్వమంటే పతంజలి గారికి పట్టరాని ఆగ్రహం.
రాజ్యం చేస్తున్న కుట్రల్ని, మతం చేస్తున్న దాడుల్ని, సమాజంలోని కల్లోలాల్ని, బతుకులోని హింసనీ, జీవితంలోని సున్నిత అంశాల్నీ పట్టుకోకుండా గాలిలో విన్యాసాలు చేస్తున్న కవిత్వం పట్ల పతంజలిగారికి contempt.
చచ్చు పుచ్చు కవిత్వం పట్ల ఎప్పటెప్పటి కోపం పేరుకుపోయిందో ఏమోగానీ, పతంజలి గారు ఈ కవితని అప్పటికప్పుడు (‘మహానగర్’ సాహిత్య పేజీలో వెయ్యడానికి మంచి కవిత దొరకక) రాసేశారు. తన పేరు పెట్టుకోకుండా కాకుండా, గనివాడ కారునాయుడు పేరుతో కంపోజింగ్ కి పంపించారు.
ఆయనతో (ఆయన కింద, ఆయన దగ్గర వంటి expressions వాడితే ఆయనకి కోపం వచ్చేది. మనిద్దరం వీళ్ళ కింద పనిచేస్తున్నామని MD రూమ్ వైపు చూపించి అనేవారు) ‘మహానగర్’ లో పనిచేసిన ఆ కొద్ది నెలలూ గొప్ప అనుభవాన్ని మిగిల్చాయి.
(originally appeared in www.magazine.saarangabooks.com)
Link
http://magazine.saarangabooks.com/2016/03/11/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B1%82-%E0%B0%9A%E0%B1%87%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%82-%E0%B0%B2%E0%B1%87%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D/
Link
http://magazine.saarangabooks.com/2016/03/11/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B1%82-%E0%B0%9A%E0%B1%87%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%82-%E0%B0%B2%E0%B1%87%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D/
Subscribe to:
Comments (Atom)
ఏ పార్టీలోకి?
రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...
-
My lil one is so happy to see me every evening coming back from work. She dances, jumps, runs, smiles with her eyes, sings and utters strang...
-
పాకిస్తాన్ రేడియోలో భారత దేశభక్తి గీతం నేను చూసిన మొట్టమొదటి రాజ్ కపూర్ సినిమాలో పాట. ఏ దేశంలో అయితే నాలుకలపై నిజంమాత్రమే వున్నదో, ఏ...