July 24, 2017

ఉపాధ్యాయుడి హృదయం ఎలా ఉండాలంటే

"ప్రతిరోజూ నేను పిల్లల్ని కలుసుకోగానే వాళ్ళ కళ్ళల్లోకి చూసే వాణ్ణి. బోధన సంక్లిష్టమైన క్రమంలో పిల్లవాడి విచారగ్రస్త నయనాలకంటే కష్టతరమైనది ఏమిటి ఉంటుంది? 
పిల్లవాడు విచారంగా ఉంటే క్లాసులో జరిగే దానిమీద దృష్టి వుంచలేడు. బిగిసిన తీగలాగ ఉంటాడు. ఒకో పిల్లవాడి దుఃఖం ఒకోలా ఉంటుంది.
దుఃఖంతో దిమ్మెత్తిపోయి గందరగోళ పడిన విద్యార్థి తాను ముందు చదివినట్టు చదవలేడు. దుఃఖం ఆలోచన క్రమాన్ని ప్రభావితం చేస్తుంది. ఉపాధ్యాయుడి ముఖ్యమైన పని ఏమిటంటే, పిల్లవాడి దుఃఖాన్నీ విచారాన్నీ బాధనీ చూడడం. పిల్లవాడి హృదయాన్ని దర్శించి అనుభూతం చేసుకోవడం. పిల్లవాడి దుఃఖాన్ని అనుభూతి చెందగలిగే స్థితి, ఉపాధ్యాయుడి బోధనా సామర్ధ్యానికి పునాది అవుతుంది."
( 'పిల్లలకే నా హృదయం అంకితం' లో సుహోమ్లిన్స్కీ)  
(My Heart I Give to Children - Vasily Sukhomlinsky) 

-- ఇలాటి ఉపాధ్యాయులు ఇప్పుడూ వున్నారు. ఇలా ఆలోచించినా అలా ఉండడం సాధ్యంగాని పరిస్థితులుండొచ్చు. సమయం సరిపోకపోవచ్చు. దీన్ని అర్ధం చేసుకోవచ్చు. 
  కానీ కొందరు ఉపాధ్యాయులు ఉన్న ఆ కాస్త ఖాళీ సమయంలో పిల్లల్ని మరింత దుఃఖంలో నెట్టివేసే వెటకారాన్ని వాడి పిల్లల హృదయాన్ని మరింత వ్యాకుల పరుస్తారు. పిల్లలు ఇరుకున పడతారు. గట్టిగా మాట్లాడితే నలుగురిలో నిలబెట్టి ఇంకొంచెం గట్టిగా మందలిస్తారు. వెటకరిస్తారు. దీంతో మరింత ముడుచుకుపోతారు. 
   ఉపాధ్యాయులందరితో, తల్లిదండ్రులందరితో సుహోమ్లిన్స్కీ, మకెరెంకో, జాన్ హోల్ట్, చలం, గిజూభాయి పుస్తకాల్ని చదివిస్తే ఎంతో ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...