నేను ఆగస్టులో ఫేస్ బుక్ లో ఓ ఫోటో పెట్టేను. పెంటకుప్పల
పైన చెట్టుకి కట్టిన ఉయ్యాలలో పడుకున్న తమ్ముడిని తాడుతో ఊపుతూ వున్న మూడేళ్ళ అన్న ప్రశాంత్ ఫోటో అది. అమ్మ, నాన్న మనం విసిరిపడేసిన చెత్తని ఓ చోట
చేర్చి మునిసిపాలిటీ ట్రక్కుల్లో ఎక్కించే పనిలో బిజీగా వుంటే, తమ్ముడు ఇశాంత్ ని పడుకోపెట్టే పనిని
ప్రశాంత్ తీసుకున్నాడు.
ఈ డంప్ యార్డు VSTకీ, RTC Garageకీ మధ్య వుంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్
బారినుంచి తప్పించుకోడానికి నాలాటి వాళ్ళు వాడే ప్రత్యామ్నాయ మార్గం.

ఇషాంత్ ఎక్కడికో వెళ్లిపోయాడు. అక్కడ ఇప్పుడు వాళ్ళమ్మ వదిలేసిన వుయ్యాల గాలికి ఖాళీగా వూగుతున్నది.
మరో చోట ఎక్కడో వాళ్ళమ్మ వుయ్యాల కట్టి వుంటుంది. పెంటకుప్పల దుర్గంధాల మధ్య నిల్చుని వాళ్ళ అన్న ఉయ్యాల ఊపుతూ వుండి వుంటాడు.
మరో చోట ఎక్కడో వాళ్ళమ్మ వుయ్యాల కట్టి వుంటుంది. పెంటకుప్పల దుర్గంధాల మధ్య నిల్చుని వాళ్ళ అన్న ఉయ్యాల ఊపుతూ వుండి వుంటాడు.
ఇషాంత్ కి ఇది మొట్టమొదటి displacement. ప్రశాంత్ కి
రెండోదో మూడోదో అయి వుండొచ్చు. వాళ్ళ అమ్మా నాన్నలైతే ఇది ఎన్నోసారో లెక్క మరిచి పోయి
వుండొచ్చు.
ఉయ్యాల్లో పడుకున్న ఇషాంత్ కి కనిపించే చెట్టు భిన్నమైనది కావచ్చు. కానీ ఆకాశంలో పెద్దగా తేడా వుండదు. కానీ, రేపో ఎల్లుండో ఉయ్యాల దిగే ఇషాంత్ కి వాళ్ళ అమ్మా నాన్నలు, అన్నయ్యలు తిరుగాడే నేల కాక భిన్నమైన నేల దొరికే అవకాశం వున్నదా?

No comments:
Post a Comment