![]() |
(ఫోటోలో, లైఫ్ స్టైల్ భవనం యజమాని బురిడీ కొట్టి కోటిన్నర కొట్టేసిన నకిలీ బాబా) |
"అంత చదువుకున్న వాడు, డబ్బున్న వాడు అంత అవివేకంగా దొంగ బాబాకి ఎలా లొంగిపోయాడు? అత్యాశ కాకపోతే ఎక్కడైనా డబ్బు వూరికే రెట్టింపు అవుతుందా? ఆమాత్రం ఆలోచన ఉండొద్దా?," ఇది ఓ మిత్రుడి కామెంట్.
నేను అన్నా,
నరమేధం చేసినవాడు దేశాన్ని బాగుచేస్తానంటే,
వెన్నుపోటు పొడిచిన వాడు సింగపూర్ ని చేస్తానంటే,
ద్రోహుల్ని ఆలింగనం చేసుకుంటున్న వాడు
మన బతుకుల్ని బంగారం చేస్తానంటే,
నమ్మ లేదా? నమ్మటం లేదా?
వాళ్ళనే నమ్ముతాం కానీ,
మన బతుకులు బండ బతుకులుగానే వున్నాయని
మన బతుకులు బండ బతుకులుగానే వున్నాయని
ఎండమావుల వెంటే మనల్ని పరిగెత్తిస్తున్నారని
చెప్పేవాళ్ళని నమ్ముతామా?
చెప్పేవాళ్ళని నమ్ముతామా?
నమ్మం కాక నమ్మం
అంతే,
దోచుకునే బాబాలను నకిలీ బాబాలుగా గుర్తించినట్టు
దోచుకునే నాయకులను నకిలీ నాయకులుగా గుర్తించం.
No comments:
Post a Comment