June 28, 2017

An appeal గాడిదలకో విన్నపం

గాడిదలకో విన్నపం
ప్రియమైన గాడిదలకు,
మీరు మానవాళికి చేస్తున్న సేవ అమోఘం. మా బరువుల్ని మీరు మీ పంటి బిగువుని మోస్తున్న తీరు శ్లాఘనీయం. కానీ మాకు సేవ చేసి సేవ చేసి మీరు చాలా ఎక్కువ అలిసిపోతున్నారు. కాబట్టి మీరు కొంచెం విశ్రాంతి తీసుకోవాలి.
ముఖ్యంగ, పొద్దున్న పూట. మా పిల్లలు స్కూళ్లకు, మేం ఆఫీసులకు వెళ్లే వరకు విశ్రాంతి తీసుకొని, నింపాదిగా లేచి రోడ్లమీదకు రాగలరు.
ఇట్లు
నగర ప్రజలు


  (PS: ఈ పోస్టు గాడిదల్ని ఉద్దేశించినది మాత్రమే. పొద్దున్నేఅశోక్ నగర్లో స్కూళ్ళు తెరిచే టైమ్ లో అన్ని జంక్షన్లలో ట్రాఫిక్ ని బాజాప్త ఆపేసి హాయిగా వెళ్ళిపోయి, వందల మంది పిల్లలు స్కూలుకు లేటవడానికి కారణమైన వీఐపీ గారి గురించి కాదు.)

మాటలో ఏముంది? ఉన్నదంతా విరుపులోనే!

పదాలలో పరుషపదాలు వేరు కావు. అవి ఎప్పుడు, ఎలా, ఎందుకు వాడతామో పరుషమా కాదా అన్నది తేలుతుంది.  కాలేజీరోజుల్లో, మా సుబ్బారావుని ఓసారి, "...