April 30, 2016

జర్నలిస్టు అంతరంగాలు

జర్నలిస్టు: చిన్నపుడు బాగా చదువుకుని వుండాల్సింది. ఈ బతుకు తప్పేది.
జర్నలిస్టు తండ్రి: వీడిమీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది. వీడి జీవితం నా వల్లే పాడైంది.
జర్నలిస్టు తల్లి: అయ్యో, నా తండ్రికి స్థిమితమైన జీవితం లేదు కదా.
జర్నలిస్టు భార్య: పెళ్ళికి ఒప్పుకునే ముందు కొంచెం ఆలోచించాల్సింది. అమ్మా నాన్నల మాటవినివుండాల్సింది.
జర్నలిస్టుల అత్త మామలు: మన కుటుంబంలో ఇంకెపుడూ జర్నలిస్టుకు పిల్లనివ్వకూడదు.
జర్నలిస్టు పిల్లలు: నాన్న ఇంకేదైనా ఉద్యోగం చేసుంటే సాయంత్రాలు హాయిగా ఆడుకుని వుండేవాళ్ళం.
జర్నలిస్టు బాసు: ఏమీ చదవకుండా ఫీల్డ్ లోకి వచ్చేస్తారు. ఇంకేదైనా పని చూసుకోవాల్సింది.
జర్నలిస్టు ఇంటి ఓనరు: జన్మలో జర్నలిస్టుకు ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు.

(కొన్ని నెలల క్రితం ఫేస్ బుక్ లో రాసింది. మరోసారి) 

No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...