May 04, 2016

మీరు జర్నలిస్టా? అయితే మీకివి గేరంటీ

"కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటొచ్చు కానీ,
కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేరు ఎవరూ" 

(ఇవే లైన్లు కావు. కానీ అదే అర్ధం వచ్చే లైన్లు) అని కవి-జర్నలిస్టు మిత్రుడు వసీరా ఓ రెండు దశాబ్దాల కింద ఓ గొప్ప కవిత రాసేరు. రెండ్లు లైన్లలోనే గొప్ప జీవిత సత్యం చెప్పేరు. జర్నలిస్టు కూడా కాబట్టే ఆయన అలా రాయగాలిగేరని నా అభిప్రాయం. జీవితం మెలిపెట్టి తిప్పుతుంటే దుఖ్ఖ పడకుండా, మనసులోనైనా కన్నీళ్లు కార్చకుండా ఎవరు రోజు గడపగలరు?

అయితే, జర్నలిస్టులకు ఇంకొన్ని అదనపు గేరంటీలు వున్నాయి. కన్నీళ్ళతో పాటు, వీటిని కూడా తోడ్కొని పోవాలి వాళ్ళు.


ఇవి రావాలని ఎవరినీ అశీర్వదించడం లేదు. కోరుకోవడం లేదు. రాకుండా వుంటే మంచిది. రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని. Occupational hazards కదా, తప్పవు. You have to live with it. You can't wish it away.
మీరు జర్నలిస్టు అయితే ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి గానీ, ఒకటి కంటే ఎక్కువగానీ వచ్చే అవకాశాలు ఎన్నో వున్నాయి.

1) వెన్ను నొప్పి
2) కాళ్ళు లాగడం
3) తలనొప్పి
4) బీపీ
5) షుగర్
6) కిడ్నీలో రాళ్ళు
7) ఫేటీ లివర్
8) డిప్రెషన్
9) డి-విటమిన్ లోపం
10) అప్పులు

ముందో వెనకో, అదో ఇదో ఖచ్చితంగా వచ్చే జబ్బులు ఇవి. కొన్నిటిని కొంతకాలం వాయిదా వెయ్యవచ్చు. అపారమైన అనుభవమున్న జర్నలిస్టులు ఈ లిస్టుకి ఇంకా add చెయ్యవచ్చు.
ఈ పదిలో ఏవైనా తప్పించుకోవచ్చు కానీ ఒకటో దాన్నీ, పదో దాన్నీ ఎవరూ తప్పించుకోలేరు.
తప్పించుకోలేనివి ఎలానూ తప్పించుకోలేరు, తప్పించు కోగలిగేవి లేదా వాయిదా వేసుకోగలిగేవి తప్పించుకునే, వాయిదేవేసుకునే ప్రయత్నం చెయ్యండి.



No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...