March 11, 2011

పతంజలి సంస్మరణ సభ

ప్రముఖ జర్నలిస్టు, రచయిత పతంజలి మరణించి రెండేళ్లవుతుంది. ఇంతకు ముందెన్నడూ లేనంతగా పతంజలి లేని లోటు కనిపిస్తున్నది. సంక్షోభ సమయాల్లో జర్నలిస్టులు, రచయితలూ ఎలా ఉండాలో, ఎలాంటి రచనలు చెయ్యాలో, ఎవరి పక్షాన నిలబడాలో పతంజలి ఎన్నో సార్లు రుజువు చేసేరు.
ప్రజలకు ఎలాంటి షరతులూ లేని మద్దతు పలకాలని, అన్యాయం ఎక్కడున్నా మాటలు మింగకుండా ధైర్యంగా నిలబడి మాట్లాడాలని పతంజలి చేసి చూపించేరు.
పతంజలి జీవితాంతం నిలబడ్డ పాత్రికేయ, సాహిత్య విలువలను తలుచుకోవడానికి ఆయన మిత్రులు, అభిమానులు ఆదివారం (మార్చ్ 13 ) నాడు ప్రెస్ క్లబ్ (సోమాజిగూడ) లో సాయంత్రం 6  గంటలకు కలుసుకోవాలని అనుకున్నారు.
ఈ సందర్భంగా, పతంజలి వ్యక్తిత్వాన్ని, సాహిత్య, పాత్రికేయ ప్రపంచాన్ని ఆవిష్కరించే పుస్తకాన్ని విడుదల చేయనున్నారు.
పతంజలి రచనల్లోని, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లలోని కొన్ని భాగాల్ని చదివి వినిపిస్తారు.

No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...